ఓక్రా టొమాటో కర్రీ
కావలసినవి:
బెండకాయలు: అరకిలో, ఆలివ్ నూనె: 2 టేబుల్‌స్పూన్లు, ఉల్లిపాయ: ఒకటి,
వెల్లుల్లి: 8 రెబ్బలు, కొత్తిమీర తురుము: 4 టేబుల్‌స్పూన్లు,
టొమాటోలు: పావుకిలో, మంచినీళ్లు: 2 కప్పులు, వెజిటబుల్ స్టాక్: 2 టేబుల్‌స్పూన్లు, దనియాలపొడి: అరటీస్పూను, దాల్చిన చెక్కపొడి: పావుటీస్పూను,
మిరియాలపొడి: అరటీస్పూను, ఉప్పు: తగినంత,
పప్పులనూనె: ముక్కలు వేయించడానికి సరిపడా.
• తయారుచేసే విధానం
* వెల్లుల్లి సన్నగా తరగాలి. టొమాటోలు మెత్తని గుజ్జులా చేయాలి.
* బాణలిలో నూనె వేసి కాగాక ముక్కలుగా కోసిన బేండకాయ ముక్కల్ని వేయించి తీయాలి.
* విడిగా ఓ బాణలిలో ఆలివ్ నూనె వేసి ఉల్లిముక్కలు, వెల్లుల్లి ముక్కలు, కొత్తిమీరతురుము వేసి వేయించాలి. ఇప్పుడు వేయించిన బేండకాయ ముక్కలు, టొమాటో గుజ్జు, మంచినీళ్లు, వెజిటబుల్ స్టాక్ పోసి, ఉప్పు వేసి మరిగించాలి.
* తరవాత సిమ్‌లో పెట్టి దనియాలపొడి, మిరియాలపొడి, దాల్చినచెక్క పొడి వేసి దగ్గరగా అయ్యే వరకూ ఉడికించి తీయాలి.

No comments:
Post a Comment