Authentic food లో ఇండియన్, mexican తరువాత నేను వేసే ఓటు Thai ఫుడ్ కే. తరువాతేchineese అయినా, అమెరికన్ అయినా లేక ఇటాలియన్అయినా. Vegetarians కి అక్కడ పెద్ద choice అంటూ ఏమి వుండదు. నా మటుకు నాకు ఉన్న ఒకే ఛాయస్.... Thai Vegetable Basil Fried Rice . సాధారణం గా ఈ
chineese , Thai Vegetable Fried Rice లలో ఎగ్, ఫిష్ సాస్ , Oyester సాస్ తప్పకుండావేస్తారు మనం వద్దు అని చెప్పకపోతే తప్ప . నా మటుకు నేను మాత్రం వెళ్ళగానే 'విత్ నో ఎగ్, నో ఫిష్సాస్ , నో Oyester సాస్ అని తప్పకుండా చెప్తాను. సరే యిక నాకు నచ్చిన ingrediants తో నేను ట్రైచేసిన Thai Vegetable Basil Fried Rice కి సంబందించిన విషయానికి వస్తే.... ( కావలసి వస్తేపైన నేను 'నో' అని చెప్పబడిన వాటితో కూడా మీరు మీ వెర్షన్ రెసిపి ట్రై చేసుకోవచ్చు. )
కావాల్సిన పదార్దాలు:
సోనమసూరి బియ్యం రెండు కప్పులు, బెల్ పెప్పర్ (గ్రీన్, రెడ్, ఎల్లో) మూడు రంగులలో తీసుకుంటే చూడటానికి అందం గా కనపడుతుంది, Thai Basil leaves (యిది ఒక bunch పడుతుంది. మామూలు అమెరికన్ గ్రోసెరీ లో కంటే కొరియన్ లేదా chineese గ్రోసెరీ లో బాగా దొరుకుతుంది.)
నువ్వుల నూనె (ఈ రెసిపి కి తప్పకుండా నువ్వల నూనె వాడి తీరాలి), రెడ్ పెప్పర్ ఫ్లేక్స్ (ఎండుమిర్చిఒకసారి వేయించి మిక్సీ కొడితే సరిపోతుంది. లేదా ఎప్పుడయినా పిజ్జా హట్ కి వెళ్ళినప్పుడు ఒకనాలుగు రెడ్ పెప్పర్ పాకెట్స్ తీసుకొచ్చి స్టోరు చేసుకున్నట్లు అయితే యింట్లో కోరు పెట్టె బాధతప్పుతుంది. నేను అయితే అదే చేస్తాను, మీకు అదే చేయమని చెప్తాను), పచ్చి మిర్చి మూడు, వెల్లుల్లిరెబ్బలు నాలుగు, ఉప్పు తగినంత, అజినమోతో చిటికెడు, సోయా సాస్ తగినంత.
తయారు చేసే విధానం:
1 . ముందుగా ఒకటికి రెండు చొప్పున నీరు పోసి అన్నం ఉడికించి పెట్టుకోవాలి.
2 . ఒక చిన్నపాటి రోకలి తీసుకుని వెల్లుల్లి, పచ్చి మిర్చి ముక్కలను బాగా దంచి పెట్టుకోవాలి.
3. వెడల్పాటి పాన్ తీసుకుని, అందులో మూడు చెంచాల నువ్వుల నూనె వేసి, అది కాగాక,పచ్చిమిర్చివెల్లుల్లి దంచిన మిశ్రమం వేసి, అది వేగాక రెడ్ పెప్పర్ ఫ్లేక్స్ వేసి కాసేపు వేగనివ్వాలి. ఈపాటికే మీకు Thai వాసనలు వచ్చేస్తుంటాయి.
4 . ఇప్పుడు సన్నగా, పొడుగ్గా తరిగిన బెల్పెప్పర్ ముక్కలు వేసి ఫ్ర్య్ చేయాలి. యిక్కడ గుర్తు పెట్టుకోదగిన విషయం ఏమిటి అంటే.... ముక్కలుపచ్చి వాసన పోయి క్రిస్పి గా తయారు అవుతే చాలు, బాగా వేగనక్కరలేదు.
5 . ఇందులో కాస్త ఉప్పు, అజినమోతో వేసి బాగా కలిపి, తరువాత మూడు చెంచాల సోయా సాస్ వేసికలపాలి.
6 . దీనిలో తరిగిన basil ఆకులను వేసి బాగా కలిపి, ఉడికించిన అన్నం కూడా వేసి బాగా కలపాలి.
7 . చివరగా ఒక సారి ఉప్పు, సోయా సాస్, నూనె చూసుకుని తక్కువ అయితే మరల కొంచం వేసికలుపుకోవాలి. కారం తక్కువ అయింది అనిపిస్తే రెడ్ పెప్పర్ ఫ్లేక్స్ దానిపై చల్లుకోవచ్చు.
ఇది మీరు వేడి వేడి గా తింటేనే ఆ రుచి ఎంజాయ్ చేయగలరు. చాలా తేలికగాచేసుకోవచ్చు. అన్నం వండి పెట్టుకుంటే, ప్రాసెస్ చాలా సులభం. వీటికి కావాల్సిన వస్తువులు కూడాతక్కువే. యిందులో ప్రత్యేకం గా గుడ్డు, ఉల్లిపాయ కావాలి అనుకునేవారు విడిగా పాన్ తీసుకునిఅందులో ఒక రెండు చెంచాల నూనె పోసి, కాగాక, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లి పాయ ముక్కలు వేసిఫ్ర్య్ చేసి, ఒక గుడ్డు దానిలో కొట్టి, కాస్త ఉప్పు చల్లి, ఫ్రైడ్ రైస్ లో కలిపితే ఆ flavour డిఫరెంట్ గావుంటుంది. అలాగే మన ఇష్టాన్నిబట్టి brocali కూడా వాడుకోవచ్చు. brocali ముక్కలను ఒకసారికడిగి మైక్రో వేవ్ ఓవెన్ లో ఒక అయిదు నిమిషాలు వుంచి అప్పుడు కూర ముక్కలతో సహా వేయిస్తేసరిపోతుంది. ఉల్లిపాయ యింక గుడ్డు మాత్రం కూర ముక్కలతో పాటు కాకుండా విడిగా చేస్తేనేబాగుంటుంది.
తప్పకుండా ఈ రెసిపి మీరు మీ ఇంట్లో నే ట్రై చేసి ఎంజాయ్ చేయండి.
THE ABOVE RECIPE COLLECTED FROM: