కావలసిన పదార్థాలు:
బాస్మతి బియ్యం-పావు కిలో, ఉల్లిపాయలు-రెండు, పైనాపిల్ ముక్కలు-రెండు కప్పులు, టమాటాలు-మూడు, టమాటా సాస్-రెండు టేబుల్ స్పూన్లు, టమాట కెచప్-ఒక టేబుల్ స్పూను, పంచదార-ఒక టీస్పూను, నూనె-కొద్దిగా.
తయారీ విధానం:
బాస్మతి అన్నం కాస్త పలుకుగా వండి చల్లార్చాలి. ఉల్లిపాయలు, టమాటాలు సన్నగా తరిగి ఉంచుకోవాలి. బాణలి స్టవ్‌పై ఉంచి అందులో కొద్దిగా నూనె వేసి ఉల్లిపాయ ముక్కలను బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేగించాలి. తర్వాత టమాట, పైనాపిల్ ముక్కలను కూడా అందులో వేసి వేగించాలి. ఇప్పుడు బాస్మతి అన్నంను అందులో వేసి ఐదు నిమిషాలు మగ్గనివ్వాలి. ఆఖర్లో సాస్, కెచప్, పంచదార వేసి బాగా కలిపి దించేయాలి.

