చైనీస్ సమోసా
కావలసినవి:
మైదా: కప్పు, ఉప్పు: అర టీస్పూను, నూనె: 2 టేబుల్‌స్పూన్లు, మంచినీళ్లు: కలపడానికి సరిపడా
లోపల నింపేందుకు: నూడుల్స్(ఉడికించినవి): కప్పు, క్యారెట్ తురుము: కప్పు, ఉల్లితురుము: కప్పు, క్యాబేజి తురుము: 2 కప్పులు, సోయాసాస్: టీస్పూను, అజినిమోటో: అరటీస్పూను, ఉప్పు: రుచికి సరిపడా, నూనె: వేయించడానికి సరిపడా
తయారుచేసే విధానం:
బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక క్యాబేజీ, ఉల్లి, క్యారెట్ తురుము, అజినిమోటో వేసి వేయించాలి. తరవాత నూడుల్స్, సోయాసాస్, ఉప్పు వేసి కలిపి రెండు నిమిషాలు ఉడికించి దించాలి. మైదాలో కాస్త గోరువెచ్చని నూనె, ఉప్పు వేసి కలపాలి. తరవాత తగినన్ని నీళ్లు పోసి చపాతీపిండిలా కలిపి తడిబట్ట కప్పి సుమారు 15 నిమిషాలు నాననివ్వాలి.ఇప్పుడు పిండిముద్దను చిన్న ఉండలుగా చేయాలి. ఒక్కో ఉండనీ చిన్న చపాతీలా వత్తాలి. తరవాత దీన్ని సగానికి కోసి, అంచుల దగ్గర తడి చేసి, కోన్ ఆకారంలో చుట్టాలి. ఇందులో టేబుల్‌స్పూను కూరగాయల మిశ్రమాన్ని పెట్టి త్రికోణాకారం వచ్చేలా అంచుల్ని మూసేయాలి. ఇలాగే అన్నీ చేసుకుని కాగిన నూనెలో తక్కువ మంటమీద వేయించి తీయాలి.

No comments:
Post a Comment