ఎగ్ లెస్ కేక్: క్రిస్మస్ స్పెషల్
కావల్సిన పదార్థాలు:
మైదా: 1cup
కండెన్స్డ్ మిల్క్: 1/2cup
పంచదార పౌడర్: 1/4cup
జీడిపప్పు: 1tbsp
ద్రాక్ష: 1tbsp
బేకింగ్ సోడా: 1/41tsp
బేకింగ్ పౌడర్: 1/21tsp
బట్టర్: 1/4cup
పాలు: 1/2cup
ఉప్పు: చిటికెడు
గ్రీస్ కోసం :
బట్టర్ : 1tbsp
మైదా : 1tbsp
తయారుచేయు విధానం:
1. ముందుగా మైదా, బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా మూడింటిని బాగా మిక్స్ చేసి జల్లు పట్టించి పక్కన పెట్టుకోవాలి.
2. తర్వాత ఇందులో పంచదార పొడి మరియు బట్టర్ రెండూ వేసి బాగా మిక్స్ చేయాలి. బట్టర్ స్మూత్ గా అయ్యే వరకూ మిక్స్ చేయాలి .
3. ఇప్పుడు అందులోనే కండెన్డ్ మిల్క్ వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా కలగలుపుకోవాలి.
4. సగం పాలు కూడా పోసి మొత్తం మిశ్రమం స్మూత్ గా అయ్యే వరకూ మిక్స్ చేసుకోవాలి.
5. ఇప్పుడు ప్రెజర్ కుక్కర్ తీసుకొని అందులో అడుగున ఒక కప్పు ఉప్పు వేసి మంటను మీడియంగా పెట్టి, ఉప్పును వేడెక్కనివ్వాలి.
6. కండెన్స్డ్ మిల్క్ మైదా మిక్స్ ను క్లాక్ వైజ్ డైరెక్షన్ లో బాగా గిలకొట్టాలి. పిండి మొత్తం స్మూత్ గా అయ్యే వరకూ ఉండలు కట్టకుండా మిక్స్ చేయాలి. మరికొద్దిగా పాలు పోసి స్మూత్ గా కలుపుకోవాలి .
7. ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ బటర్ ను బేకింగ్ బౌల్ కు రాసి, దాని మీద ఒక టేబుల్ స్పూన్ మైదాను చిలకరించి తర్వాత లోపలి బౌల్ లోపలిబాగాన్ని కవర్ చేయాలి.
8. ఇప్పుడు ఈ పిండి మిశ్రమంలో జీడిపప్పు మరియు ద్రాక్ష వేసి మొత్తం మిశ్రమాన్ని మరోసారి మిక్స్ చేసి బేకింగ్ బౌల్లో మిక్స్ చేయాలి .
9.ఇప్పుడు ఈ బేకింగ్ బౌల్ ను కుక్కర్ లో పెట్టి మూత పెట్టాలి. విజిల్ పెట్టకూడదు. 10. తక్కువ మంట మీద 30-40నిముషాలు ఉడికించుకోవాలి. 40నిముషాల తర్వాత మూత తీసి బేకింగ్ బౌల్లో కేక్ మొత్తం, అన్ని వైపులా బ్రౌన్ కలర్ లోకి మారిందో లేదో సరిచూసుకోవాలి.
11. తర్వాత చాకును కేకు లోపలికి చొప్పించి చూడాలి. పైకి తీసినప్పుడు , సులువగా చాకు బయటకు వస్తే అది తప్పనిసరిగా కేక్ తయారైనట్లే. అలా కాకుంటే మరో 10నిముషాలు తక్కువ మంట మీద తిరిగి బేక్ చేసుకోవాలి .
12. కేక్ రెడీ అయిన తర్వాత బేకింగ్ బౌల్ ను బయటకు తీసి, స్టౌ ఆఫ్ చేసి, చల్లారనివ్వాలి.
13. చల్లారిన తర్వాత బేకింగ్ బౌల్ ను ఒక సర్వింగ్ ప్లేట్ మీద బోర్లించి కేక్ ను నిధానంగా రిమూవ్ చేయాలి. కేక్ మొత్తం బటకు తీసుకొన్న తర్వాత మీకు నచ్చిన షేప్ లో కట్ చేసి సర్వ్ చేయాలి. అంతే క్రిస్మస్ స్పెషల్ ఎగ్ లెస్ కేక్ రెడీ..
No comments:
Post a Comment