మసాలా గ్రిల్డ్ ఫిష్::
కావల్సిన పదార్థాలు:
పాంఫ్రెట్ ఫిష్ : 2
నిమ్మరసం: 3tbsp
ఉల్లిపాయ: 1
అల్లం : చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు: 6
పచ్చిమిర్చి : 1 or 2
గరం మసాల: 1tbsp
ఆమ్చూర్(డ్రై మ్యాంగో పౌడర్): 1tsp
ధనియాలపొడి: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
తయారుచేయు విధానం:
కావల్సిన పదార్థాలు:
పాంఫ్రెట్ ఫిష్ : 2
నిమ్మరసం: 3tbsp
ఉల్లిపాయ: 1
అల్లం : చిన్న ముక్క
వెల్లుల్లి రెబ్బలు: 6
పచ్చిమిర్చి : 1 or 2
గరం మసాల: 1tbsp
ఆమ్చూర్(డ్రై మ్యాంగో పౌడర్): 1tsp
ధనియాలపొడి: 1tsp
ఉప్పు: రుచికి సరిపడా
నూనె: తగినంత
తయారుచేయు విధానం:
1. ముందుగా పాంఫ్రెట్ ఫిష్ కు పొట్ట వద్ద చిన్న గాటు పెట్టి పొట్టను తెరచి లోపల ఉన్న వ్యార్థాన్ని పూర్తిగా తొలగించి డొల్లగా ఉంచడం వల్ల లోపల మసాలాను స్టఫ్ చేయవచ్చు. 2. తర్వత చేపకు నిమ్మరసం మరియు ఉప్పు పట్టించి 10నిముసాలు పక్కన పెట్టుకోవాలి.
3. అంతలోపు, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, వెల్లుల్లి మరియు అల్లంను మొత్తగా పేస్ట్ చేసుకోవాలి.
4. ఈ పేస్ట్ కు గరం మసాలా, డ్రై మ్యాంగో పౌడర్ మరియు ధనియాలపొడి జోడించి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి.
5. ఈ మసాలను నిమ్మరసం ఉప్ప పట్టించి పక్కన పెట్టుకొన్న చేపలకు మసాలా పేస్ట్ ను కూడా పట్టించాలి. అలాగే కొంత మసాలా పేస్ట్ ను ఫిష్ పొట్టలో స్టఫ్ చేయాలి. ఇలా స్టఫ్ చేసిన ఫిష్ ను 20నిముషాలు పక్కన పెట్టుకోవాలి.
6. అంతలోపు ఓవెన్ ను 250డిగ్రీల్లో ప్రీహీట్ చేయాలి.
7. తర్వాత మ్యారినేట్ చేసిన చేపలకు కొద్దిగా నూనెను అప్లై చేయాలి. ఇలా రెడీ చేసుకొన్న ఫిష్ ను ఓవెన్ లోని గ్రిల్డ్ రాడ్స్ మీద పెట్టాలి. తర్వాత, వోవెన్ డోర్ క్లోజ్ చేసి 20నిముషాలు 60శాతం పవర్లో హీట్ చేయాలి.
8. తర్వాత ఫిష్ ను మరో వైపు త్రిప్పి ఉంచి మరో సారీ హీట్ చేయాలి. అంతే గ్రిల్డ్ మసాలా ఫిష్ రెడీ. దీన్ని సలాడ్ తో సర్వ్ చేయాలి. అంతే గ్రిల్డ్ మసాలా ఫిష్ రెడీ.
No comments:
Post a Comment