చికెన్ వింగ్స్
కావల్సినవి:
చికెన్ ముక్కలు - నాలుగు, సోయాసాస్ - నాలుగు చెంచాలు,
దాల్చినచెక్కపొడి - చిటికెడు, అల్లం,వెల్లుల్లి తరుగు - చెంచా చొప్పున,
ఎండుమిర్చి పేస్టు - అరచెంచా, టొమాటో కెచెప్ - ఒకటిన్నర టేబుల్‌స్పూను, హాయిసిన్ సాస్ - ఒకటిన్నర టేబుల్‌స్పూను(బజార్లో దొరుకుతుంది), ఉప్పు - తగినంత, చికెన్బ్రాత్ పౌడర్ - అరచెంచా(బజార్లో దొరుకుతుంది), చక్కెర - అరచెంచా, మొక్కజొన్నపిండి - రెండు టేబుల్‌స్పూన్లు,
మైదా - రెండు చెంచాలు, ఎండుమిర్చి గింజలు - అరచెంచా,
ఉల్లికాడల తరుగు - టేబుల్‌స్పూను, నూనె - వేయించేందుకు సరిపడా.
తయారీ:
చికెన్ ముక్కల్ని కడిగి అక్కడక్కడా గాటు పెట్టాలి. తరవాత వీటిపై సోయా సాస్, సరిపడా నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఆ నీళ్లు పూర్తిగా ఒంపేసి ఈ చికెన్ ముక్కలపై ఎండుమిర్చి గింజలూ, మొక్కజొన్న పిండీ, మైదా వేసి బాగా కలపాలి. బాణలిలో నూనె వేడిచేసి ఈ ముక్కల్ని ఎర్రగా వేయించుకుని తీసుకోవాలి. ఇప్పుడు మరో బాణలిలో కొద్దిగా నూనె వేడిచేసి అల్లం, వెల్లుల్లి తరుగు వేయించాలి. అందులో ఎండుమిర్చి పేస్టూ టొమాటో కెచెప్, హాయిసిన్ సాస్, దాల్చినచెక్కపొడీ వేయాలి. రెండు నిమిషాల తరవాత తగినంత ఉప్పూ, చక్కెరా, చికెన్బ్రాత్ పౌడర్ వేసి.. ముందుగా వేయించిపెట్టుకున్న చికెన్‌ని అందులో వేసి ఈ మసాలా ఆ ముక్కలకు పట్టేలా బాగా కలపాలి. వీటిని ఉల్లికాడల తరుగుతో కలిపి వడ్డిస్తే చాలా బాగుంటాయి.

No comments:
Post a Comment