ఆపిల్-కోకనట్ హల్వా: న్యూట్రీషియన్ స్వీట్ రిసిపి
కావల్సిన పదార్థాలు
కావల్సిన పదార్థాలు
ఆపిల్: 1
కొబ్బరి తురుము: 1cup
డ్రై ఫ్రూట్స్: 20 grams
నెయ్యి: 2 tbsp
పంచదార: 1 cup
పాలు : 1 cup
యాలకలపొడి: కొద్దిగా
తయారుచేయు విధానం:
1. ఒక పాన్ తీసుకొని అందులో నీళ్ళు, పాలు, పంచదార, ఆపిల్ తురుము వేసి మొత్తం మిశ్రమాన్ని బాగా మిక్స్ చేయాలి.
2. ఇప్పుడు ఈ పాన్ ను స్టౌ మీద పెట్టి, మీడియం మంట మీద కొన్ని నిముషాలు ఉడికించాలి. మొత్తగా పేస్ట్ అయ్యే వరకూ ఉడికించుకోవాలి.
3. మొత్తం మిశ్రమం చిక్కబడే సమయంలో అందులో డ్రైఫ్రూట్స్ (రఫ్ గా పొడి చేసుకొని లేదా అలాగే )వేసుకొని, బాగా మిక్స్ చేయాలి. చివరగా కొద్దిగా నెయ్యి వేసి మొత్తం మిశ్రమాన్ని కలగలుపు కోవాలి.
4. ఆ తర్వాత కొబ్బరి తురుము, యాలకలపొడి వేసి మరో సారి మిక్స్ చేయాలి . అలాగే కొద్దిగా నెయ్యి మిక్స్ చేసి తర్వాత మరికొన్ని నిముషాలు ఉడకించుకోవాలి. చివరగా కొద్దిగా ఫుడ్ కలర్ అవసరం అనిపిస్తే జోడించుకోవచ్చు . అంతే ఆపిల్ హల్వా రెడీ. ఒక ప్లేట్ లోకి సర్వ్ చేసి, చెర్రీస్ తో గార్నిష్ చేసి వేడి గా లేదా చల్లగా సర్వ్ చేయాలి. అంతే యాపిల్ హల్వా రెడీ.
No comments:
Post a Comment