మష్రూమ్ క్విచీ
కావల్సినవి:
టార్ట్స్ కోసం: మైదా - కప్పు,
చల్లని వెన్న - వంద గ్రాములు,
బేకింగ్ పౌడర్ - రెండు చెంచాలు,
చల్లని నీళ్లు - మూడు నాలుగు టేబుల్‌స్పూన్లు,
ఉప్పు - కొద్దిగా, టార్ట్ చేసే పాత్ర.
• ఫిల్లింగ్ కోసం:
ఉల్లిపాయలు - మూడు, బటన్ పుట్టగొడుగులు - పావుకేజీ, ఉల్లికాడల తరుగు - మూడు టేబుల్‌స్పూన్లు, మిరియాలపొడి - అరచెంచా, ఉప్పు - తగినంత, నూనె - పావుకప్పు, చీజ్ తరుగు - అరకప్పు, గుడ్లు - రెండు, పాలు - అరకప్పు.
తయారీ:
ఓవెన్‌ని 180 డిగ్రీల ఉష్ణోగ్రతలో వేడిచేయాలి. మైదా, ఉప్పూ, బేకింగ్‌పౌడర్‌ని కలపాలి. అందులో చల్లని వెన్న వేసి బ్రెడ్‌పొడిలా వచ్చేలా బాగా కలపాలి. తరవాత చల్లని నీళ్లు పోసి పిండిలా వచ్చేలా కలిపి ఇరవైనిమిషాలు ఫ్రిజ్‌లో ఉంచాలి. ఇప్పుడు బాణలిలో నూనె వేడిచేసి ఉల్లిపాయ ముక్కల్ని వేయించుకోవాలి. అవి ఎరుపురంగులోకి వచ్చాక ఉప్పూ, మిరియాలపొడీ, పుట్టగొడుగుల ముక్కలూ, ఉల్లికాడల తరుగూ వేసి మూత పెట్టేయాలి. పుట్టగొడుగుల ముక్కలు మెత్తగా అయ్యాక దింపేయాలి. గిలకొట్టిన గుడ్ల సొనా, పాలూ, చీజ్ తరుగును ఓ గిన్నెలోకి తీసుకుని కలిపి పెట్టుకోవాలి. టార్ట్ పాత్రకు కొద్దిగా నూనె రాసి ఫ్రిజ్‌లో ఉంచిన మైదా మిశ్రమాన్ని అందులో సగం వరకూ నింపాలి. దానిపై పుట్టగొడుగుల మిశ్రమాన్ని టాపింగ్‌లా రాసి గుడ్డుసొనా, పాల మిశ్రమాన్నిదానిపై వేసి ఓవెన్‌లో అరగంటసేపు బేక్ చేయాలి. అంతే, మష్రూమ్ క్విచీలు సిద్ధం.

No comments:
Post a Comment