కావలసిన పదార్థాలు:
మిరపకాయలు - పావుకిలో, నువ్వులు - 100 గ్రాములు, ఉల్లిపాయలు -రెండు, ధనియాలు - ఒక టేబుల్ స్పూను, జీలకర్ర - అర టీ స్పూను, ఎండుమిరపకాయలు - రెండు, కరివేపాకు - రెండు రెబ్బలు, వెల్లుల్లి రేకలు - నాలుగు, ఉప్పు - తగినంత, నూనె - సరిపడా.
తయారుచేయు విధానం:
మిరపకాయలకు మధ్యలో గాటుపెట్టి పక్కన పెట్టుకోవాలి. ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తరువాత నువ్వుల్ని దోరగా వేగించి పెట్టుకోవాలి. కొద్దిగా నూనెతో ధనియాలు, ఎండుమిరపకాయలు, జీలకర్రను కూడా వేగించి పెట్టుకోవాలి. బాగా చల్లారాక మిక్సీగిన్నెలో నువ్వులు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి పొడి చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టౌ మీద గిన్నె పెట్టి సరిపడా నూనె పోసి వేడెక్కాక వెల్లుల్లి రేకలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేగించాలి. తరువాత మరో టేబుల్ స్పూను నూనె పోసి మిరపకాయలు కూడా వేసి బాగా వేగించాలి. ఉప్పు, కారం, పసుపు వేసి బాగా కలిపి సన్నని మంటపై మగ్గనిచ్చి వేగించి పొడి చేసుకున్న నువ్వుల పొడిని మూడు టేబుల్ స్పూన్లు వేసి బాగా కలపాలి. అరకప్పు నీళ్లు పోసి మళ్లీ కాసేపు ఉడికించాలి. నీరంతా పోయాక దించేయాలి.