కావలసిన పదార్థాలు :
బాస్మతి బియ్యం-రెండు కప్పులు, నీళ్లు-ఐదు కప్పులు, పెసరపప్పు-ఒక కప్పు, పంచదార-ఐదు కప్పులు, నెయ్యి-పావు కిలో, బెల్లం-100గ్రా, కొబ్బరి తురుము-ఒక కప్పు, యాలకుల పొడి-చిటికెడు, జీడిపప్పు-50గ్రా, కిస్మిస్-50గ్రా.
తయారుచేసే విధానం:
స్టవ్‌పై గిన్నె ఉంచి అందులో నీళ్లు పోసి కడిగిన బాస్మతి బియ్యం, పెసరపప్పు వేసి బాగా ఉడికించాలి. తర్వాత పంచదార, బెల్లం, వేసి కలుపుతూ ఉండాలి. కాస్త పాకం వచ్చాక కొబ్బరి తురుము వేసి కలపాలి. తర్వాత బాగా మరిగించిన నెయ్యిని వేసి కలుపుతూ ఉండాలి. బాగా దగ్గరికి అయిన తర్వాత దించే ముందు యాలకుల పొడి వేయాలి. సర్వింగ్ బవుల్లోకి తీసుకున్న తర్వాత పైన జీడిపప్పు, కిస్మిస్ చల్లాలి.

No comments:
Post a Comment